D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఏప్రిల్ 1 వైరా/ (అక్షరంన్యూస్) వైరా మున్సిపాలిటీకి చెందిన సంగెపు లక్ష్మీ సాహితి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాల్లో మల్టీ జోన్ వన్ లో 129 వ ర్యాంకు సాధించడం పట్ల వారి నివాసంలో ఆమెకు శాలువాతో సత్కరించి స్వీటు తినిపించారు. గ్రూప్ వన్ ఫలితాల్లో వైరా పట్టణం పేరును చిరస్థాయిలో నిలిపారని, సామాన్య మద్దతు తరగతి కుటుంబం నుంచి ఎంతో కష్టపడి చదివి ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడం బలహీన వర్గాలకు చెందిన సంగెపు లక్ష్మీ సాహితి అభినందనయం అని పేర్కొన్నారు. ఆమెను అభినందించిన వారిలో మాదినేని రామనారాయణ, కట్ల శ్రీకాంత్, కట్ల సంతోష్, కట్ల వేదిత సైన, కట్ల సంజీవ్ పార్ధు తదితరులు ఉన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకూ శుభాకాంక్షలు తెలియజేశారు.
.
Aksharam Telugu Daily