D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 29 వైరా (అక్షరం న్యూస్) ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజి పినపాక బ్రిడ్జి పై కూలీలతో వెళుతున్న ఆటోను వెనకనుంచి లారీ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి పలువురు కూలీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు కొనిజర్ల మండలం గోపవరం గ్రామానికి చెందిన కూలీలు తల్లాడ మండలం మంగాపురం గ్రామంలో మొక్కజొన్న పీకలు తొలగించేందుకు 15 మంది కూలీలతో ఆటో వెళ్తుండగా పినపాక బ్రిడ్జిపై గుంట ఉండటంతో ఆటోను స్లో చేస్తుండగా వెనకనుంచి అతివేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీ కొట్టింది ఆటోలో వెనక కూర్చున్న ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి .. ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి ప్రమాద సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై పి,రామారావు, బ్లూ కోట్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ , డ్రైవర్ కిషోర్, గాయపడ్డ మహిళలను108 లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని కూలీలు ఊపిరి పీల్చుకున్నారు.
.
Aksharam Telugu Daily