Monday, 20 April 2026 07:16:46 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న అక్షరం దినపత్రిక – పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష – 2026 అక్షరం దినపత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 12 January 2026 03:47 PM Views : 338

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి | డిసెంబర్ 12 | అక్షరం న్యూస్ : నిత్యం వినూత్న కథనాలు, ప్రజాసమస్యలపై నిర్మాణాత్మక వార్తలతో అక్షరం దినపత్రిక ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని నిజాయితీగా ప్రతిబింబిస్తూ, ప్రజల గొంతుకగా అక్షరం దినపత్రిక నిలుస్తోందని ఆయన ప్రశంసించారు. సోమవారం అక్షరం దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2026 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పత్రికలు కేవలం వార్తలు మాత్రమే కాకుండా ప్రజల్లో చైతన్యం నింపే సాధనాలుగా మారాలని, ఆ దిశగా అక్షరం దినపత్రిక సమర్థవంతంగా పని చేస్తోందని అన్నారు. ప్రజల సమస్యలను బాధ్యతాయుతంగా వెలుగులోకి తీసుకువచ్చి, పాలనకు – ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న పత్రికగా అక్షరం గుర్తింపు పొందిందని తెలిపారు. అక్షరం దినపత్రిక రూపొందించిన 2026 క్యాలెండర్‌లో ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ సెలవులు, జాతీయ–రాష్ట్ర ప్రాధాన్యత గల దినోత్సవాలు, ముఖ్య తేదీలు సమగ్రంగా పొందుపరిచినట్లు తెలిపారు. ఈ క్యాలెండర్ ప్రజల దైనందిన జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి అక్షరం ప్రతినిధి దొమ్మటి రాజేష్, సీనియర్ పాత్రికేయులు సోమకుమార్, పని సుదర్శన్, నూనె శ్రీనివాస్ తో పాటు పలువురు పాత్రికేయులు, అక్షరం అభిమానులు పాల్గొన్నారు. కలెక్టర్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం అక్షరం దినపత్రికకు మరింత గౌరవం, ప్రోత్సాహంగా నిలిచిందని వారు పేర్కొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :