Sunday, 29 March 2026 01:50:59 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం.. వరంగల్ నగరంలో ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 26 March 2026 04:16 PM Views : 174

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా/ వరంగల్ టౌన్/ మార్చ్ 26/ అక్షరం న్యూస్ -: వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని వరంగల్ నగరంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించారు. చిరంజీవి రాష్ట్ర అధ్యక్షులు కొయ్యడ ప్రభాకర్ (కరాటే ప్రభాకర్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంత ప్రాణాధారమో గుర్తించి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం ద్వారా లక్షలాది మందికి ప్రాణదానం జరుగుతోందన్నారు. రక్తదానం అంటే ప్రాణదానం అనే భావనతో అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన కరాటే ప్రభాకర్‌ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా జన్మదినం జరుపుకుంటున్న రామ్ చరణ్‌కు ఆయురారోగ్యాలు కలగాలని, భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే చిరంజీవి (కొణిదల శివశంకర వరప్రసాద్) సేవలను ప్రశంసిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :