D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా టౌన్ సెప్టెంబర్ 30 (అక్షరం న్యూస్) వైరా మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ ఈ సేవ్ ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ కమీషనర్ రామచంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందికి వైద్య పరీక్షలుబీపీ పరీక్షలు నిర్వహించారు.అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల ఆరోగ్య పరిరక్షణ ముఖ్యమని ఏ కాలంలోనైనా వారి సేవలు అమోఘమని కార్మికులను అభినందించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ సుధీర్ కౌన్సిలర్లు వుండ్రు వరలక్ష్మి నల్లమోతు శైలజ చింత నిప్పు సులోచన ముల్లపాటి విజయలక్ష్మి పణి తి సైదులు చిలక చిన్న కోటయ్య మోరు శ్రీకాంత్ తిరుపతి శివకుమారి మాదినేని సునీత డిసిసి డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కాపామురళీకృష్ణ వుండ్రుశ్యామ్ బాబు ముళ్ళపాటి సీతారాములు తిరుపతి శ్రీనివాసరావు వేముల రత్నాకర్ మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి నప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily