D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఆగష్టు 28 (అక్షరం న్యూస్ ) అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను శుక్రవారం కోమట్లగూడెం నేతకాని కాలనీలో 2 వాడ్డు లో ఘనంగా జరుపుకున్నారు రాఖి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీలు కట్టి వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థించారు.రాఖీ కట్టించుకున్న సోదరులు తమ సోదరీమణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పరస్పరం స్వీట్లు తినిపించుకుని బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ పండుగను ఆనందంగా జరుపుకున్నారు.రాఖీ పండుగ కేవలం ఒక దారం కట్టే సంప్రదాయం మాత్రమే కాకుండా, ప్రేమ, నమ్మకం, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే ఈ పర్వదినాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించారు.
.
Aksharam Telugu Daily