Friday, 23 October 2026 02:32:15 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

డాక్టర్ కాపా లోహితకు ఎం.ఎస్. పట్టా.. వైరా వైద్య దంపతులు డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ చంద్రకళ కుమార్తెకు పలువురు అభినందనలు

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 22 October 2026 06:59 PM Views : 696

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/వైరా టౌన్ అక్టోబర్ 22 (అక్షరం న్యూస్) వైరాకు చెందిన ప్రముఖ వైద్య దంపతులు డాక్టర్ కాపా మురళీకృష్ణ, డాక్టర్ కాపా చంద్రకళ కుమార్తె డాక్టర్ కాపా లోహిత ప్రసూతి, స్త్రీల వ్యాధుల విభాగంలో శస్త్రచికిత్సా నిపుణతతో కూడిన మాస్టర్ ఆఫ్ సర్జరీ (ఎం.ఎస్.) పోస్టుగ్రాడ్యుయేషన్ పట్టాను గురువారం అందుకున్నారు. చెన్నైలోని శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విశ్వవిద్యాలయం నుంచి ఆమె ఈ పట్టాను పొందారు.డాక్టర్ లోహిత ఎం.బి.బి.ఎస్. విద్యను పూర్తి చేసిన అనంతరం, మమత మెడికల్ కాలేజీలో తన వైద్య విద్యను కొనసాగించి, అనంతరం ఎం.ఎస్. పోస్టుగ్రాడ్యుయేషన్ కోసం చెన్నైలోని శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో చేరారు. అక్కడ ప్రసూతి, స్త్రీల వ్యాధుల విభాగంలో ఉన్నత వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి ఎం.ఎస్. పట్టాను సాధించారు.వైద్య వృత్తిలో ఉన్నత విద్యను అభ్యసించి, శస్త్రచికిత్సా విభాగంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పట్టాను సాధించిన డాక్టర్ లోహితను వైరా ప్రాంతానికి చెందిన వైద్యులు, ప్రముఖులు, కుటుంబసభ్యులు,శ్రేయోభిలాషులుఅభినందించారు. భవిష్యత్తులో వైద్య రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, ప్రజలకు విశిష్టమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైరా మండల డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దారెల్లి కోటయ్య, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పెంట్యాల భాస్కరరావు, డాక్టర్ పెరుమాళ్ల కృష్ణమూర్తి, డాక్టర్ సతీష్ కుమార్, తమ్మిశెట్టిn ఉమామహేశ్వరరావు, డాక్టర్ దారెల్లి హరిత, డాక్టర్ లగడపాటి చరిత, డాక్టర్ శ్రీధర్ గౌడ్, లయన్ లగడపాటి ప్రభాకర్ రావు, ఉండ్రు శ్యాంబాబు, ఉండ్రు వరలక్ష్మి, చింతనిపు వెంకటయ్య, జాల పుల్లారావు, ఉయ్యూరు రామకృష్ణ, తోటకూర శ్రీకాంత్, గంగవరపు కిషన్, పెనుగొండ ఉపేందర్ రావు, కొల్లా రాంబాబు, చెరుకూరు శ్రీనివాసరావు, షేక్ పాషా, కొదుమూరు రవి, ఏపూరి రాజారావు, గద్దె నీరజ, గజ్జల కృష్ణమూర్తి, చింతోజు నాగేశ్వరరావు, వై. బుచ్చి రామారావు, మరికంటి రాంగోపాల్, కన్యాదారి హనుమాయమ్మ, కుతుంబాక ఇంద్రాణి తదితరులు డాక్టర్ లోహితకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :