Friday, 10 July 2026 11:41:31 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జిల్లా పెయింటర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

నూతన జిల్లా అధ్యక్షులుగా నాంసాని నరసయ్య


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 10 July 2026 06:30 PM Views : 14

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జూలై 10 అక్షరం న్యూస్ పెద్దపల్లి జిల్లా పెయింటర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శుక్రవారం జిల్లా కేంద్రంలో కొలువుదీరింది.గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ మంద భాస్కర్ యాదవ్,జిల్లా అధ్యక్షులుగా నాంసాని నర్సయ్య,ఉపాధ్యక్షులుగా దావల్ల రవి,అరికోల్ల వెంకటేష్,బండారి శ్రీనివాస్, సెక్రటరీగా మినుముల సది,క్యాషియర్లుగా చంద్రగిరి సుమన్,పల్లె విజయ్,సలహాదారులుగా మెంగని నాగరాజు,తాడం ప్రసాద్,గడ్డం శంకర్,గరిగంటి రాజేందర్,మహ్మద్ తాజ్, ఆర్గనైజర్లుగా శనిగరం నాగరాజు,గడ్డం లక్ష్మణ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు నాంసాని నర్సయ్య మాట్లాడుతూ ఇన్నేళ్ల తర్వాత పెయింటర్లందరూ ఏకతాటిపైకి రావడం గర్వకారణమని,భవన నిర్మాణ రంగ కార్మికులంతా అన్నదమ్ముల్లా ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.తమ వృత్తికి,ఇంటి యజమానులకు తగిన గౌరవాన్ని ఇస్తూనే, సభ్యుల సమస్యల పరిష్కారానికి,సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.అనంతరం ముఖ్యఅతిథిగా హాజరైన మార్బుల్ అండ్ టైల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కల్లపెల్లి రవి నూతన కమిటీని సన్మానించి శుభాకాంక్షలు తెలుపుతూ,ఈ ఐక్యత భవిష్యత్తులో పెయింటర్ల హక్కుల సాధనకు,అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన పెయింటర్లు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :