P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల /పెద్దపల్లి జనవరి 25 (అక్షరం న్యూస్) ఓటు హక్కు అనేది దేశ అభివృద్ధికి మార్గం చూపుతుందని తాసిల్దార్ ధీరజ్ కుమార్ అన్నారు. ఓటరు దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రం ఓదెల కస్తూరిబా గాంధీ పాఠశాలలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకొని మంచి పరిపాలన అందించే వారిని ఎన్నుకోవాలని అన్నారు. సందర్భంగా ఓటరు దినోత్సవ పురస్కరించుకొని సదస్సులో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. మండలంలో ఓటరు నమోదు కార్యక్రమంలో బిఎల్ఓ లు చేస్తున్న పనితీరును ఆయన ప్రశంసించి సత్కరించారు. పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును వినియోగించుకొని గ్రామాల అభివృద్ధికి ముందుకు సాగాలని సరైన వ్యక్తిని ఎన్నుకునే హక్కు ఓటు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఓటరు దినం పురస్కరించుకొని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు వేసిన రంగుల పటం అధికారులను ముగ్ధుల్ని చేసింది. ఓటరు దినం చిత్రపటాన్ని వేసిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని పావని స్థానిక తాసిల్దార్ ఎస్సైలు అభినందించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారిని జ్యోతి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, రెవిన్యూ సిబ్బంది, కేజీబీవీ అధ్యాపక బృందం, బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily