Saturday, 18 April 2026 06:42:03 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

స్ఫూర్తి కుటుంబం తెలంగాణా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఇన్నోవేట్ ది ఇన్నర్ సెల్ఫ్' ఆధ్యాత్మిక సభాకార్యక్రమం

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 14 September 2025 08:40 PM Views : 591

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 14 (అక్షరంన్యూస్) “మానవతా రక్షతి రక్షితా:” నినాదంతో, మానవతా సమాజ స్థాపనే లక్ష్యంగా ఆధ్యాత్మిక విశ్వ గురువు శ్రీ గురు విశ్వస్ఫూర్తి ఆశీస్సులతో, వారి భక్తులు “స్ఫూర్తి కుటుంబం - తెలంగాణ” ట్రస్ట్ ఏర్పాటు చేసి, పలు సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఖమ్మం పట్టణంలోని శ్రీ నగర్ కాలనీలోని ఎస్‌. ఆర్. కన్వెన్షన్ ఫంక్షన్ హాలులో, ' ఇన్నోవేట్ ది ఇన్నర్ సెల్ఫ్' పేరుతో సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా గవర్నమెంట్ ఐటిఐ కాలేజీ ప్రిన్సిపాల్ ఏ. శ్రీనివాస్ హాజరయ్యారు. సభనుద్దేషించి వారు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులనీ, మానవతా విలువలు, మంచి అలవాట్లు బాల్యంలోనే చొప్పించాలని తెలియజేసారు. స్ఫూర్తి కుటుంబం-ట్రస్ట్ ద్వారా మానవత్వాన్ని ప్రచారించడం హర్షించదగ్గర విషయమని కొనియాడారు. శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు సుమారు నాలుగు పదుల గ్రంథాలు రచించారు. మనిషి, మానవ సమాజానికి సంబంధించి అన్ని విషయాలు, అలాగే ఆధ్యాత్మిక సంబందిత విషయాలు, సాధన విధానాలు ఎన్నో‌ పొందుపరచారు. వారందించి‌న ఆ జ్ఞానభండాగారాన్ని, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సభా కార్యక్రమాల ద్వారా మానవజాతికి అందిస్తున్నారని తంబూరి దయాకర్ రెడ్డి తెలియజేసారు. మనిషి, మనసు, జీవితం, కుటుంబం, సమాజం, నేటి బాలల పట్ల కుటుంబ సమాజ బాధ్యత, ప్రాక్టికల్ ఫిలాసఫీ, రిలీజియస్ హ్యుమానిటీ అనే అంశాలపై సభికులు ఉపన్యసించారు. మానవత్వం ఆచరణలో తీసుకురావాలని, ప్రతి మనిషి సాటి మనిషిని, మనిషిగ గుర్తుంచి, గౌరవించడం మానవత్వం అని, దాన్ని ఆచరణలో నిరూపించు కోవాలని, మానవత్వ సమాజ స్థాపన అనే మహా యజ్ఞం కొరకు అందరూ భాగస్వామ్యం కావాలని ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆళ్ళ రాజేష్ పిలుపునిచ్చారు. మనిషిలో పశుత్వం, క్రూరత్వంతో పెరిగి, మానవజాతి మనుగడకే ప్రమాదం పొంచి వున్న నేటి సమాజంలో, మనిషిలో మానవత్వం పెంపొందించాలనీ, సమాజంలో‌ ఆత్మీయత స్థాపన జరగాలనేది శ్రీ గురు విశ్వస్ఫూర్తి ఆశయమని, డిప్యూటీ సివిల్ సర్జన్ డా. రామారావు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ సభ్యులు కె. రాధాకృష్ణ, వి. విక్రమ్, ఎన్‌. సురేష్, జె. రవింద్రబాబు, రిటైర్డ్ స్కిన్ స్పెషలిస్ట్ డా. విమల, అసిస్టెంట్ ఇంజనీర్ గోపాల్, జె. వెంకటేశ్వరరావు, జోనల్ ఇంచార్జి ఎన్. రవికుమార్ తదితరులు విచ్చేసి సభలో పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :