AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఒకేషనల్ గ్రూపులు అంటే ఎందుకంత చులకనా? భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 5/ అక్షరం న్యూస్ --- కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద బి ఎస్ ఎప్ ఐ ఆధ్వర్యంలో ఒకేషనల్ గ్రూపులను ఆ గ్రూపులో చదివే విద్యార్థులను పనికిమాలిన వాళ్లు అని అవమానించిన చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిఎస్ఎఫ్ఐ చర్ల మండల అధ్యక్షులు కొట్టే నవీన్ మాట్లాడుతూ కాలేజీ లోని ఒక విద్యార్థి నీ ఈ టీ గ్రూపు కు చేంజ్ చేయాలని కోరగా గ్రూపు చేంజ్ చేయకపోగా ఆ ఒకేషనల్ గ్రూపులన్నీ పనికిమాలిన గ్రూపులని ఆ గ్రూపులో చదువుతున్న విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ కాదని చదువు రానివారు మాత్రమే ఆ గ్రూపులో చేరతారని బిలో యావరేజ్ స్టూడెంట్స్ మాత్రమే ఆ గ్రూపులో ఉంటారని ఆ గ్రూపుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని అనడం ఆశ్చర్యకరమని అన్నారు. అవి చెత్త గ్రూపులని కమిషనర్ కూడా మాతో అంటున్నాడని అన్నారు.ఒక బాధ్యత గల పోస్టులో ఉండి తన కాలేజీలో ఉన్నటువంటి ఒకేషనల్ కోర్సుని మంచి గ్రూపు కాదని చెప్పడం అత్యంత దుర్మార్గమని అన్నారు. విద్యార్థులను అదేవిధంగా ఆ గ్రూపుకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులను కూడా ఘోరంగా అవమానించినట్లేనని మండిపడ్డారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపించాలని సంబంధిత ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులను ఉపాధ్యాయులను అవమాన భారం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు ఎం ఎల్ నారాయణ బి ఎస్ ఎఫ్ ఐ చర్ల మండలం నాయకులు నీలం సంతోష్ కుమార్ కట్ట రాజేష్ ప్రతాప్ రెడ్డి బాలు, జగదీష్, సాయి సుజిత్ , భగత్ సింగ్, ధనుష్ తేజ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily