AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/జూలూరుపాడు/సెప్టెంబర్05/అక్షరం న్యూస్: మండల కేంద్రంలోని పాపకొల్లు రోడ్డు నందు గల సాయి ఎక్సలెంట్ స్కూల్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయి ఎక్సలెంట్ పాఠశాల కరెస్పాండెంట్ ఆరెబోయిన హుస్సేన్, రిటైర్డ్ ఉపాధ్యాయులు రాంశెట్టి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు మద్దిశెట్టి శ్రీనివాసరావులు ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సాయి ఎక్సలెంట్ పాఠశాల కరెస్పాండెంట్ ఆరెబోయిన హుస్సేన్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన పుట్టినరోజును జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. అదేవిధంగా రాంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాధాకృష్ణన్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సమయంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన విధానం ఉపాధ్యాయ వృత్తికి చాలా అవసరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులు రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ విద్యా బోధనలు సాగించాల్సి వస్తుందన్నారు. అనంతరం మద్దిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ సాయి ఎక్సలెంట్ స్కూల్లో ప్రతీ సంవత్సరం నవోదయ, ఏకలవ్య, సైనిక్, గురుకులాల్లో సీట్లు సాధించడం చాలా సంతోషమన్నారు. ఈ ఏడాది పాఠశాలలో డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేసి పట్టణ స్థాయి విద్య అందిస్తున్న సాయి ఎక్సలెంట్ పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి పాఠశాల అభివృద్ధికి సహకరించాలన్నారు. అనంతరం స్కూల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా విద్యార్థులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జక్కుల శివ కుమారి, ఆరెబోయిన నాగలక్ష్మి, ఉపాధ్యాయులు సత్యవతి, నబీన, అనిత, ఉదయభాను, ప్రశాంతి, అనిత, రమేష్,అరుణ, కళ్యాణి, పావని, భార్గవి, స్వాతి, రుచిత, శిరీష, కృష్ణవేణి, జమున, యామిని, మమత, సునీత, రజిత, రమేష్, దుర్గ, తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily