Sunday, 25 October 2026 01:46:03 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన.. 13, వార్డు కౌన్సిలర్ ముళ్ళపాటి విజయ సీతారాములు

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 25 October 2026 12:08 PM Views : 68

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా టౌన్ అక్టోబర్ 25( అక్షరం న్యూస్) పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు పచ్చని చెట్ల పెంపకం ఎంతో అవసరమని వైరా మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ ముళ్ళపాటి విజయలక్ష్మి అన్నారు. ఆథివారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా 13వ వార్డులో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని కౌన్సిలర్ ముళ్ళపాటి విజయలక్ష్మి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ సిబ్బందితో కలిసి వార్డులోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ ముళ్ళపాటి విజయలక్ష్మి మాట్లాడుతూ.. భావితరాల భవిష్యత్తు కోసం మొక్కల పెంపకం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. చెట్లు స్వచ్ఛమైన గాలిని అందించడంతోపాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటి, అది పెరిగి పెద్దదయ్యే వరకు బాధ్యతగా సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు మున్సిపల్ శానిటేషన్ అధికారులు వెంకట్రావు, శ్రీను, పలువురు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :