D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ** ఖమ్మం/ వైరా అక్టోబర్ 14 (అక్షరం న్యూస్) అశ్వాపురం మండల కేంద్రంలోని కాలువ బజారు లో ఉన్న సాయిబాబా ఆలయంలో నందు లైన్స్ క్లబ్ ఆఫ్ అశ్వాపురం స్టార్స్ మరియు వైరా లయన్స్ ఐ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. వైద్య శిబిరాన్ని అశ్వాపురం గ్రామంలో లైన్స్ ఇంటర్నేషనల్ జోనల్ చైర్మన్ నల్లగట్ల సత్య ప్రకాష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి. రవిచంద్ర దాదాపు మంది180 కి కంటి పరీక్షలు నిర్వహించి, 25 మందికి కంటి ఆపరేషన్స్ గుర్తించారు. ఈ సందర్భంగా లైన్స్ ఇంటర్నేషనల్ జోనల్ చైర్మన్ నల్లగట్ల సత్య ప్రకాష్ మాట్లాడుతూ పేద ప్రజలకు లయన్స్ కంటి ఆసుపత్రి వైరా సహకారంతో అశ్వాపురం పరిసర ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ అశ్వాపురం ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి ఎంతో మందికి చూపును అందించడం జరిగింది అని తెలిపారు. అలాగే లయన్ డాక్టర్ కాపా మురళి కృష్ణ ఐ హాస్పిటల్ నిర్వాకులు , లయన్ డాక్టర్ ఉండ్రు శ్యాంబాబు, డాక్టర్ రవిచంద్ర, కంటి ఆసుపత్రి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily