Wednesday, 04 March 2026 01:40:28 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఈ రహదారులు యమపూరికి మార్గాలు ఇంకెన్ని రోజులు ప్రజలు ఈ గుంటల రోడ్లపై ఇబ్బందులు పడాలి ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానిక

భద్రాచలం టూ వెంకటాపురం ప్రధాన రహదారికి తక్షణమే మరమ్మత్తులు నిర్వహించాలి బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షులు కొండా చరణ్


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 20 August 2025 05:41 PM Views : 540

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 20/ అక్షరం న్యూస్/--- మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇసుక లారీల కారణంగా పాడైపోయిన ప్రధాన రహదారిని బాగు చేయాలని తక్షణమే మరమ్మత్తులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సామరస్యంగా శాంతియుతంగా ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు స్థానిక ఎమ్మెల్యేకి నియోజకవర్గంలో ఉన్న ఇసుకని తరలించే పనిలో ఉన్న శ్రద్ధ ఆ ఇసుక తరలించడం వల్ల పాడైపోయిన రోడ్లను బాగు చేయడం లో లేదని విమర్శించారు. భద్రాచలం నుండి వెంకటాపురం వరకు ఉన్న ప్రధాన రహదారి ఇసుక లారీల ధాటికి మొత్తం ధ్వంసం అయిందని కనీసం టూ వీలర్ తిరిగే అవకాశం కూడా లేకుండా పాడైపోయిందని అన్నారు. ఉద్యోగస్తులు ఎవరు కూడా సమయానికి ఆఫీస్ కి వెళ్లకుండా రోడ్లపై పడిన గుంటలు ఆటంకంగా మారాయని అన్నారు. అంబులెన్స్ సైతం సమయానికి హాస్పిటల్ కు చేరుకోవడం లేదని తెలిపారు. విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అవ్వడం లారీలు దిగబడిపోవడం నిరంతరం జరుగుతున్నాయని అన్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఇదివరకు గంట సమయం పట్టేదని ఇప్పుడు రెండు గంటలు పడుతుందని అన్నారు. ఈ గుంటల కారణంగా అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ప్రయాణం అంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారని అన్నారు. ఎప్పుడు ఏ బ్రిడ్జి కూలి పోతుందో తెలియని పరిస్థితిలో నియోజకవర్గంలో పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్ని రోజులు ప్రజలు ఈ అవస్థలు పడాలని ప్రశ్నించారు. ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందులకు స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని అన్నారు. కనీసం ప్రజలకు రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేని ఎడల ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తక్షణమే బాజాప్తుగా తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో ప్రజలు బిఎస్పీ అధికారాన్ని ఇవ్వాలని తద్వారా నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం పాడైపోయిన ఈ రోడ్డుకు మరమ్మత్తులు నిర్వహించాలని ప్రజలు పడుతున్న ఇబ్బందులకు స్వస్తి పలకాలని కోరారు. లేనియెడల బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన పోరాటాల నిర్వహిస్తామని ప్రజా సమస్య పరిష్కారం కోసం చట్టం పరిధిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు సామల ప్రవీణ్ కుమార్ బివిఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ ములకాల సందీప్ చర్ల మండల పార్టీ ఉపాధ్యక్షులు కొండా కౌశిక్ చర్ల మండల కోశాధికారి చెన్నం మోహన్ చర్ల మండలం ఈసీ మెంబర్ షేక్ జహీరుద్దీన్ పాషా చర్ల సెక్టార్ కార్యదర్శి అయినవోలు శ్రీను చర్ల సెక్టార్ కార్యదర్శి వాసు, చెన్నం పవన్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :