Tuesday, 10 February 2026 09:01:07 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఫ్లాష్ ఫ్లాష్ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఎదుట యువకుడు ఆత్మ హత్య యత్నం ....తండ్రి మృతి తర్వాత వారసత్వ ఉద్యోగం కోసం యువకుడి పోరాటం ....

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 18 August 2025 02:33 PM Views : 1990

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఆగస్టు 18 అక్షరం న్యూస్; పెద్దపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బండి సతీష్ కలెక్టర్ ఎదుటే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం ప్రకారం, సతీష్ తండ్రి బండి మధుమయ్య గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత 25 ఏళ్లుగా పార్ట్‌టైమ్ స్వీపర్‌గా పనిచేశారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం జెండా అవతరింపజేస్తున్న సమయంలో ఆయనను విషపురుగు కుట్టింది. దీంతో ఆయనను కరీంనగర్, వరంగల్ ఆసుపత్రికి తరలించగా, జనవరి 29న చికిత్స పొందుతూ మృతి చెందారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్ట్‌లో కూడా విషపురుగు కాటు వల్లే మరణం సంభవించిందని వైద్యులు నిర్ధారించారు. తండ్రి మృతితో పేద చాకలి కుటుంబం దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయింది. కుటుంబానికి ఉద్యోగం, సొంత ఇల్లు కల్పించాలని సతీష్ ప్రజావాణికి హాజరై కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాడు. అయితే, తన మనవి వెంటనే పరిష్కారం కానందున ఆవేదనతో కలెక్టర్ ఎదుటే గడ్డి మందు తాగి పడిపోయాడు. అక్కడే కలెక్టరేట్‌లో ఉన్న అధికారులు అప్రమత్తమై అతడిని వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కలెక్టరేట్ వాతావరణం కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. నిరుపేద కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం ఉద్యోగం, ఇల్లు కల్పించి న్యాయం చేయాలని గ్రామస్తులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :