Monday, 02 March 2026 09:33:19 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బంది నిర్లక్ష్యం*.. *దురుసు ప్రవర్తన* .. *రోగులకు తప్పని తిప్పలు.*.

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 01 March 2026 06:53 PM Views : 107

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ మార్చి 1 అక్షరం న్యూస్) ఖమ్మం సర్వజన ఆస్పత్రిలో సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి, శనివారం ఓ మహిళ చేయి విరిగి వైద్యం కోసం వస్తే ఆమె పట్ల సిబ్బంది వ్యవహరించిన తీరు, సిబ్బంది నిర్లక్ష్యానికి మచ్చుతునకగా మారింది, సుమారు నాలుగు గంటల పాటు ఎక్స్రే, కోసం వేచి చూడాల్సి వచ్చింది, రేపు రా వెళ్ళండి రా అంటూ, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితురాలు వాపోయింది, బాధతో వచ్చిన బాధితులకు ఉపశమనం కలగాల్సింది పోయి, ఆవేదన పెరిగిపోతుందని రోగులు ఆరోపిస్తున్నారు, రోగుల పట్ల సిబ్బంది వ్యవహరించే తీరు అంటరాని వారి పట్ల వ్యవహరించేలా ఉందని ఆరోపిస్తున్నారు, జిల్లా అధికారులు స్పందించి, ప్రజలకు సకాలంలో సరైన వైద్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు, *కలెక్టర్ సాబ్ జరా దేకో* జిల్లా కలెక్టర్ ఆస్పత్రి సిబ్బంది వ్యవహార శైలిపై, దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించి, సిబ్బంది రోగుల పట్ల వ్యవహరించి విధానాన్ని గమనించి, మార్పు తెచ్చేందుకు కృషి చేయాలని ప్రజలు జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :