D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *ఖమ్మం, స్టాఫ్ రిపోర్టర్ వైరా, ఫిబ్రవరి 3 (అక్షరంన్యూస్)* అక్షరం దినపత్రిక 2026 నూతన క్యాలెండర్ ను వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ. వరప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు. అక్షరం దినపత్రిక ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ దేవబత్తిని సీతారాములు ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన క్యాలెండర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్ల కు పైగా పత్రిక రంగంలో విస్తృత సేవలు అందిస్తున్న పత్రిక యాజమాన్యానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా పత్రిక దినదిన అభివృద్ధి చెంది ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం సీతారాములు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ ను జ్ఞాపకం అందించి శాలువా తో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జీ తెలుగు రిపోర్టర్ వెన్నుపూస వీరారెడ్డి, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, హోంగార్డు ఆలీ, రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily