AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కోరుట్ల /జగిత్యాల : : రాయికల్, అక్షరం న్యూస్, ఏప్రిల్ 04 పంట నష్టాలపై ప్రభుత్వం స్పందించాలని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రాయికల్ పట్టణంలోని కోయడి మహిపాల్ రెడ్డి ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రకృతి వైపరీత్యాలతో మొక్కజొన్న, మామిడి పంటలు నేలపాలయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. పంటల బీమా పథకం అమలు లేకపోవడంతో రైతులకు ఎలాంటి పరిహారం అందడం లేదని విమర్శించారు. రైతు భరోసా పథకాన్ని ఎకరాల పరిమితి లేకుండా ఎకరానికి రూ.6000చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400ఉన్నప్పటికీ రైతులకు రూ.1,800మాత్రమే లభిస్తున్నదని, దీనితో దళారులు లాభ పడుతున్నారని అన్నారు. రాయికల్ లో కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడాన్ని తప్పుబట్టారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20, 000పరిహారం ఇవ్వాలని, రైతు బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఏప్రిల్ 15వరకు ఎస్ఆర్ఎస్పి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
.
Aksharam Telugu Daily