Friday, 06 March 2026 03:18:57 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జాతీయ జెండాకు అవమానం ....

24 గంటలు గడిచిన జాతీయ జెండా అవనతం చేయని బిజెపి నాయకులు .... బిజెపి పార్టీ తీరుపై ఆగ్రహం వెళ్లగకుతున్న జమ్మికుంట వాసులు ....


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 16 August 2025 01:47 PM Views : 586

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/ఆగస్టు 16/అక్షరం న్యూస్- నేతి బీరకాయలో నెయ్యి ఎంతో .....బిజెపి పార్టీలో దేశభక్తి అంత ....!?.79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని హుజురాబాద్ రోడ్డులో కల బిజెపి పట్టణ కార్యాలయంలో జాతీయ పథకాన్నిఎగురవేసి అవమానించారు. బిజెపి నాయకులు. వివరాల్లోకి వెళ్తే జమ్మికుంట పట్టణంలో గల బిజెపి కార్యాలయం ముందు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కానీ ఆగస్టు 15 సాయంత్రం అవనతం చేయాల్సి ఉండగా మరుసటి రోజు (ఆగస్టు 16) శనివారం రోజు 11:30 వరకు జాతీయ జెండా కిందకు దింపకుండా జాతీయ జెండాను అవమానించారు. బిజెపి మాట్లాడితే దేశం కోసం దేశ ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ బిజెపి అని, బిజెపి పార్టీకి తప్ప దేశభక్తి ఏ పార్టీకి లేదని గొప్పలు చెప్పుకునే నాయకులు జాతీయ జెండాను ఈ విధంగా అవమానించడం ఏంటని పలువురు రాజకీయ నాయకులు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .దేశం కోసం అహర్నిశలు పాటుపడతామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే బిజెపి నాయకులు దేశానికే గర్వకారమైన జాతీయ జెండాను అవమానించడం పట్ల దేశంపై బీజేపీకి పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదొ ఇట్లే అర్థమవుతుందని పలువురు పురవాసులు తీవ్ర ఆక్రష్యాన్ని వెలగకుతున్నారు. సదర్ విషయంపై మున్సిపల్ అధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జాతీయ జెండా గౌరవాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేధావి వర్గం కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :