P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి జనవరి 14 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని జీలకుంట గ్రామంలో ఘనంగా రంగురంగుల రంగవల్లిలా పోటీలు గ్రామ ఆడపడుచులంతా ఒక దగ్గర చేరి రంగురంగుల రంగవల్లులు వేసి అందర్నీ ఆకర్షించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ ను షణ్ముఖ అగ్రిటెక్ అధికారులు మరియు గ్రామ సర్పంచ్ రాగిడి మంగా శ్రీనివాస్ రెడ్డి ఘనంగా శాలువతో సన్మానించారు ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ సంక్రాంతి పండగ అంటేనే ఇంటి ముందట రకరకాల రంగవల్లులతో గ్రామానికి ఒక వన్నెతెచ్చే ఈ పండగ సంక్రాంతి పండగని ఈ పండుగకు కొత్త అల్లుళ్ల రాకతో కొత్త సందడి నెలకొంటుందని మరియు రంగవల్లులు వేసి అందులో గొబ్బెమ్మలను పెట్టి ఘనంగా తెలుగింటి ఆడపడుచులు రంగ రంగ వైభవంగా జరుపుకునే ఈ పండగ అని అన్నారు గ్రామ ప్రజలకు మరియు అధికారులకు భోగి పండుగ మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా. షణ్ముఖ అగ్రిటెక్ ఆధ్వర్యంలో ఇలాంటి ముగ్గుల పోటీలను నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు మహిళల్లో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికితీయడం, సంప్రదాయ గ్రామీణ సంస్కృతిని కాపాడడం, పండుగల ఆనందాన్ని సమాజమంతా పంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అని అన్నారు , మహిళలు తరతరాలుగా కొనసాగిస్తున్న సంప్రదాయ కళలు గ్రామీణ సంస్కృతికి ప్రాణం పోస్తున్నాయని అన్నారు. ముగ్గులు, రంగవల్లులు వంటి కళలు పండుగల సమయంలో మాత్రమే కాకుండా సమాజ ఐక్యతను పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామాల్లో ఉత్సాహాన్ని పెంచి, పండుగ వాతావరణాన్ని మరింత ఉల్లాసంగా మారుస్తాయని అభినందించారు. ఈ సందర్భంగా షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్ రీజినల్ మేనేజర్ గుండ్ల స్వామి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ సంగం శ్రీనివాస్ మాట్లాడుతూ, సంస్థ ఎల్లప్పుడూ రైతులు, మహిళలు, గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలు విశేష ఆదరణ పొందాయి. పోటీల్లో పాల్గొన్న మహిళలు రంగురంగుల, తో కళాఖండాలను ఆకట్టుకునే ముగ్గులు వేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. జవాను లేకపోతే దేశానికి రక్షణ లేదు. రైతు లేకపోతే మెతుకు లేదు అనే ముగ్గు. ప్రథమ బహుపది అందించారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇరుకుల్ల శ్రీనివాస ట్రేడింగ్ కంపెనీ ప్రతినిధులు, గ్రామ సర్పంచ్ రాగిడి మంగ–శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ మనోజ్ క్రాంతివీర్, వార్డు సభ్యులు మాచర్ల మధుకర్, దొడ్డిపల్లి శ్రీనివాస్, బంగారి పద్మ, వంగల సంధ్యారాణి, పూదరి సుమలత, మేడిచెల్లిమల వేణుగోపాల్, అగ్గి శ్రీనివాస్, ముంజల శ్రీధర్, కటుకూరి సునీత, ఏరియా మేనేజర్ కంకణాల శ్రీనివాస్, సేల్స్ ఆఫీసర్ ముక్కెర ఆంజనేయులు, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీకాంత్, మైపాల్, లక్పతి తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
.
Aksharam Telugu Daily