D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా టౌన్ అక్టోబర్ 23 (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో వన మహోత్సవ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. వన మహోత్సవం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, కాలుష్యాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకట్రావు, వార్డు ప్రజలు దేవభక్తుని రవీంద్ర, లగడపాటి ప్రభాకరరావు ప్రభాకర్ రావు, తోటకూర శ్రీకాంత్, విజయలక్ష్మీ, కల్పన, సుశీల, లక్ష్మీరాజ్యం, కృష్ణవేణి, సంధ్య, ఉప్పలమ్మ, ఆర్‌పీ ఫాతిమా, లక్ష్మణరావు, జవాన్ శ్రీను, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily