Sunday, 29 March 2026 03:30:41 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కోడ్" కూయకముందే ప్రచారాలు


Jakkani Rajaramesh , SIRCILLA.

Reporter

Date : 22 January 2026 09:11 PM Views : 403

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : " రాజన్న సిరిసిల్ల, జనవరి -22 (అక్షరం న్యూస్): మున్సిపల్ ఎన్నికలకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకముందే సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలలో బరిలో దిగే నాయకులు ఆత్రుతతో ఎన్నికల "కోడ్" (అధికారిక ప్రకటన) రాకముందే "ఎన్నికల ప్రచారం" విస్తృతంగా చేపడుతున్నారు. మాజీ కౌన్సిలర్లతో పాటు నూతన ఆశవాహులు సైతం ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ముందస్తు పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. కొందరు లీడర్లు ప్రతి గడపగడపకు తిరుగుతూ "క్యాలెండర్లు లడ్డూలు"పంచుతూ తమ వార్డు ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ముసలి, ముతక, చిన్నారులను సైతం పలకరించుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. చరవాణిలో ప్రతిరోజు స్టేటస్ లలో ప్రచారాలు జోరుగా సాగిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకే కాకుండా ప్రతి ఒక్కరికి బహుమతులు పంచడం వెనుక ఎన్నికల పరమార్ధం ఉందని కొందరు అనుకుంటున్నారు. క్రికెట్ పోటీలు, ఆటల పోటీలను కూడా నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా మంచినీటి సరఫరా ఉండాలని బోర్లను సైతం మరమత్తులు చేయించారు. ఎన్నికలు రాకముందే ఇలా చేస్తే ఎన్నికల సమయంలో ఇంకెంత జోరుగా ప్రచారాలు విందులు, వినోదాలు పంచుతారో ఎవరెవరికి ఎంత లబ్ది చేకూరుతుందోనని వార్డు ప్రజలు ఆశతో ఎదురు చూడటం వారికి అలవాటుగా మారింది. ఏదేమైనా గెలిచిన అభ్యర్థులు తాము ఖర్చు పెట్టింది వడ్డీతో సహా రాబట్టుకోకుండా వార్డును అభివృద్ధి చేస్తే చాలని రాజకీయ విశ్లేషకులు ఆశిస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :