Sunday, 29 March 2026 04:58:15 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వైరా క్రాంతి కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం..

యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని నిజాయితీగల ప్రజా ప్రతినిధులు ఎన్నుకోవాలి.... నా ఓటు- నా హక్కు" అనే భావనతో ప్రతి ఎన్నికల్లో పాల్గొనాలి... ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాకుండా అది దేశ అభివృద్ధికి మన వంతు బాధ్యతగా ఉండాలి.. విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి సునీత... విద్యా సంస్థల కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 24 January 2026 03:35 PM Views : 160

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 24 వైరా (అక్షరం న్యూస్) ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ లోని క్రాంతి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి సునీత అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యా సంస్థల కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘాన్ని 1950లో ఏర్పాటు చేశారని ఆ తరువాత 2011 జనవరి 25 నుండి జాతీయ ఓట్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి ముఖ్యమైన బాధ్యత అని ఓటు ద్వారా మనం అర్హులైన నిజాయితీగల ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటాము. ఆ రకంగా దేశ భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని నిజాయితీగల ప్రజా ప్రతినిధులు ఎన్నుకోవాలి. " నా ఓటు- నా హక్కు" అనే భావనతో ప్రతి ఎన్నికల్లో పాల్గొనాలి. ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాకుండా అది దేశ అభివృద్ధికి మన వంతు బాధ్యత అని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎన్ ఎస్ ఎస్ పి ఓ లింగారావు విద్యార్థుల చేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విద్య సంస్థల డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత, ప్రిన్సిపల్ కృష్ణారావు, మజీద్, వేణు, చైతన్య అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :