P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి మార్చి 13 (అక్షరం న్యూస్) లేబర్ పోర్టల్ లోపాలను సరిచేసి అర్హులకు లేబర్ కార్డు ఇవ్వాలని కార్మిక శాఖ మంత్రి వినతి పత్రం ఇచ్చిన యువ నాయకుడు అల్లం సతీష్ ఈ సందర్భంగా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని హైదరాబాదు లోని మినిస్టర్ క్వార్టర్స్ లో శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు అల్లం సతీష్ కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అల్లం సతీష్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం పేద కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన లేబర్ కార్డు పథకం అమలులో వెబ్ పోర్టల్ లోపాల వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చాలా మంది కార్మికులు ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటికీ మొదట రిజిస్ట్రేషన్ చూపించినా, కొంతకాలం తర్వాత వారి వివరాలు డేటాబేస్‌లో కనిపించడం లేదని పేర్కొన్నారు. దీంతో కార్మికులు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఈ ప్రక్రియలో దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారని, కొందరు అధికారులు కూడా కమిషన్‌లతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్నవారు, ఎల్‌ఈడి స్క్రీన్ ఆపరేటర్లు, లైటింగ్ విభాగం కార్మికులు సహా అనేక మంది సినీ మరియు ఇతర రంగాల కార్మికులకు ఇప్పటికీ లేబర్ కార్డులు లేవని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే లేబర్ పోర్టల్‌లో సాంకేతిక లోపాలను సరిచేసి డేటా భద్రత కల్పించడంతో పాటు అర్హులైన వారందరికీ ఉచితంగా లేబర్ కార్డులు అందించాలని అల్లం సతీష్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కోరారు. వెంటనే దీనిపై మంత్రి స్పందిస్తూ తగిన చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరిస్తానని చెప్పడం జరిగిందని అన్నారు
.
Aksharam Telugu Daily