Saturday, 07 February 2026 04:32:09 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

21వ వార్డులో ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం ..ఇంటింటా తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్న చైర్మన్ అభ్యర్థి నూగిళ్ల మల్లయ్య

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 06 February 2026 05:23 PM Views : 22

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఫిబ్రవరి 6 అక్షరం న్యూస్; పెద్దపల్లి పట్టణంలోని 21వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న నూగిళ్ల మల్లయ్య ఎన్నికల ప్రచారంలో జోరు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి ఇంటింటా తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుగానే ప్రకటించడంతో ఈ వార్డులో రాజకీయ ఆసక్తి మరింత పెరిగింది. తాను గెలుపొందితే కౌన్సిలర్‌గా మాత్రమే కాకుండా మున్సిపల్ చైర్మన్‌గా పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని నూగిళ్ల మల్లయ్య ప్రజలకు హామీ ఇస్తున్నారు. తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రచారంలో వివరించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, మంత్రి శ్రీధర్ బాబు అండదండలతో ఈ ప్రాంతాన్ని మరింత ప్రగతి బాటలో నడిపిస్తానని చెబుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో 21వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :