Saturday, 07 February 2026 04:32:14 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ ప్రచార హోరు ..ఇంటింటా తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్న కల్పన–రమేష్

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 06 February 2026 05:44 PM Views : 107

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : పెద్దపల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 6 అక్షరం న్యూస్; పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకల కల్పన–రమేష్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిసి కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించి, మరోసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు సహకారంతో ఎనిమిదో వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని ఓటర్లకు భరోసా కల్పిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని కాల్వ శ్రీరాంపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ మేకల జనార్దన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారానికి ఉత్సాహం నింపుతున్నారు. ఇంటింటి ప్రచారంతో కాంగ్రెస్ అభ్యర్థి కల్పన–రమేష్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :