DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : .. పెద్దపల్లి ప్రతినిధి జనవరి 9 అక్షరం న్యూస్; పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని శాంతినగర్‌లో గల రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన లక్ష్మీ–జంపయ్య దంపతులు విజయకేతనం ఎగురవేస్తూ గెలుపు దిశగా వేగంగా దూసుకెళ్తున్నారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, మద్దతు చూస్తే ఈ వార్డులో కాంగ్రెస్ విజయం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. స్థానికంగానే నివసిస్తూ, ప్రతి కుటుంబంతో కలివిడిగా మెలిగే లక్ష్మీ జంపయ్య దంపతులపై ప్రజలకు ఉన్న విశ్వాసం ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తోంది. వార్డు సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండటంతో రెండో వార్డు ప్రజలు గట్టిగా బలపరుస్తున్నారు. “నన్ను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తా… ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కీలక పాత్ర పోషిస్తా” అంటూ లక్ష్మీ జంపయ్య దంపతులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అండదండలతో, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతో రెండో వార్డు అభివృద్ధి కోసం ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. లక్ష్మీ జంపయ్య దంపతుల ప్రచారానికి శాంతినగర్ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ శక్తి మరింత బలపడింది. ఈ ఎన్నికల్లో చెయ్యి గుర్తుకే పట్టం కట్టేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
.
Aksharam Telugu Daily