GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపెల్లి/ గోదావరిఖని (జ్యోతి నగర్ ): : జ్యోతి నగర్ ఎన్టిపిసి ఫిబ్రవరి 16 పెద్దపల్లి జిల్లా అక్షరం న్యూస్ రామగుండం నగరపాలక సంస్థ నూతన మేయర్ గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ గా పాత పెళ్లి ఎల్లయ్య పేర్లు ఖరారైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం 11 గంటలకు రామగుండం మున్సిపల్ కౌన్సిల్ లో ఈ ఎన్నిక లాంచన ప్రయాణంగా జరిగే అవకాశం ఉంది. హైదరాబాదు నుంచి కార్పొరేటర్లు అందరూ బస్సుల్లో మున్సిపల్ కౌన్సిల్ హాల్ కు చేరుకోబోతున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రతి కౌన్సిలర్ తో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రమాణ స్వీకారం తర్వాత ముందుగా మేయర్ ఎన్నిక జరుగుతుంది ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. జిల్లా పరిషత్ సీఈవో అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 12 30 నిమిషాలకు మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు.
.
Aksharam Telugu Daily