DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఫిబ్రవరి 07 అక్షరం న్యూస్ పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని, అమర్ నగర్ 24వ వార్డులో బీజేపీ అభ్యర్థి తాటిపర్తి సుధ రాజగోపాల్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నా ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, మాజి ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నిర్వహించారు. స్థానిక ప్రజలను పలకరిస్తూ బిజెపి కమలం గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్తులను గెలిపించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. పలు దుకాణాలు, ఇంటింటికి తిరుగి బీజేపీ కరపత్రాలు అందజేస్తూ కమలం గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు జన నిరాజనాలు జై బీజేపీ నినాదాలు. పెద్దపల్లిలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది. సురభికాలనీ అమర్ నగర్ 24వ వార్డులోనూ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రచారంలో మహిళలు బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై బీజేపీ నినాదాలతో హోరేత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వ నిదులు రావాలని ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం సిద్దించాలి కేంద్ర ప్రభుత్వ నిదులతోనే మున్సిపాలిటీలలో అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిదులు లేవని ఆ విషయాన్ని స్వయంగా సీఎం చెప్తున్నారన్నారు మీమీ. వార్డులలో అభివృద్ధి చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ లో ఫండ్స్ లేవు కాబట్టి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక అభ్యర్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily