Sunday, 29 March 2026 03:27:08 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పెద్దపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించండి.. పెద్దపల్లి పట్టణంలో ఘనంగా అభివృద్ధి కార్యక్రమాలు.. పట్టణాన్ని సుందరంగా తీర్

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 03 February 2026 09:47 AM Views : 195

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఫిబ్రవరి 02 అక్షరం న్యూస్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలోని 12వ వార్డు, 29వ వార్డు మరియు 31వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే పెద్దపల్లి చింతకుంట విజయరమణరావు పట్టణంలోని సాగర్ రోడ్డు కంచేర భావి వద్ద గల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దొడ్డుపల్లి జగదీష్, 29వ వార్డు ఇల్లందుల రజనీ కృష్ణమూర్తి మరియు 31వ వార్డులో మంథని నర్సింగ్ ఈ నెల ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచాక పెద్దపల్లి పట్టణం మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. పెద్దపల్లి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోట్ల రూపాయల నిధులను వెచ్చించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని గత పాలకులు అభివృద్ధి విషయంలో మొద్దు నిద్ర పోయారని విమర్శించారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి వారి సొంతింటి కళ నెరవేరుస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, జీరో వడ్డీ రుణాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, ఉచిత సన్న బియ్యం, సన్న వడ్ల బోనస్, రైతు రుణమాఫీ, 5 లక్షల ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపుదల, రైతు భరోసా మరియు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం విషయంలో విఫలం అయ్యారని మళ్లీ ఎ మొహం పెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లను అడుగుతున్నారని విమర్శించారు. పెద్దపల్లి పట్టణంలో గత బి.ఆర్.ఎస్ పాలకులు నిలువు దోపిడీలకు పాల్పడ్డారని బి.ఆర్.ఎస్ పార్టీ వారి దోపిడీలను ప్రజలందరూ గమనిస్తున్నారని వారికి మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణ ప్రజలు చైతన్యవంతులని బి.ఆర్.ఎస్ మరియు బీజేపీ పార్టీల వారికి ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో నూతన బస్సు డిపో, బైపాస్ రోడ్డు, నూతన్ కోర్టు భవనం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలకు ఆధునీకరణ, సిటీ స్కాన్, ఎం.ఆర్. ఐ మరియు తాను ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్ల పాలనలో రూ.40 కోట్లతో సీసీ రోడ్లు, మురికి కాలువలు, మౌళిక వసతుల కల్పన పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో పాత వాటర్ ట్యాంక్ స్థానంలో కొత్తగా వాటర్ ట్యాంక్, చందపల్లి డబుల్ బెడ్ రూం ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేస్తున్నామని తెలిపారు. రూ 62.50 కోట్లతో అభివృద్ది పనులు ప్రారంభించామని, మరో 15 కోట్ల నిధులు మంజూరు చేయించానని తెలిపారు. వీటిని ప్రజల అవసరాలను గుర్తించి నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి రూ 77.50 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆధునీకరణ కోసం రూ 7.5 కోట్లు కేటాయించినట్లు వివరించారు. క్రీడల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాని ఇందులో భాగంగా వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఇండోర్ బ్యాడ్మింటన్ షటిల్ స్టేడియం ఏర్పాటుకు డిఎంఎఫ్ టీ నుండి రూ 2.5 కోట్లు కేటాయించి పనులు చేపట్టినట్లు . పట్టణంలోని శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అధికార పార్టీ అభ్యర్థులనే కౌన్సిలర్లుగా గెలిపిస్తే అభివృద్ది సాధ్యమన్నారు. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం రోజున జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే విజయరమణ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :