Monday, 16 February 2026 04:31:50 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సమాజ అభివృద్ధిలో విద్యే మౌలిక శక్తిగా నిలుస్తుంది *ఐజేయూ ఆధ్వర్యంలో పదోవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ*

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 13 February 2026 07:40 PM Views : 32

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ ఫిబ్రవరి 13(అక్షరం న్యూస్) కొత్త గూడ మండలం లోని సమాజ అభివృద్ధిలో విద్యే మౌలిక శక్తిగా నిలుస్తుంది అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ టియుడబ్ల్యూజే ( ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు...శుక్రవారం నాడు కొత్తగూడ మండల ఐజేయూ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడ మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదోవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఐజేయూ కొత్తగూడ మండల అధ్యక్షులు ఎస్.కె. సల్మాన్ పాషా అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్,మండల విద్యాశాఖ అధికారి గుమ్మడి లక్ష్మినారాయణ,పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు నెల్లుట్ల భాస్కర్, ట్రైబల్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ ,గూడూరు మండలం అధ్యక్షులు యకంబ్రం,జిల్లా నాయకులు కరుణాకరరెడ్డి లు ముఖ్య అతిథిలుగా హాజరైనారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య అనేది వ్యక్తి జీవితాన్నే కాదు, సమాజ భవిష్యత్తును మార్చే శక్తివంతమైన ఆయుధమని తెలిపారు. ఉపాధ్యాయులు ఎటువంటి స్వార్థం లేకుండా విద్యార్థుల కోసం తమ జీవితాలను అంకితం చేస్తున్నారని ప్రశంసించారు. విద్యార్థులు ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో చదువుకుంటే తప్పకుండా విజయ శిఖరాలను చేరుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు విద్యార్థుల అవసరాలను ముందుగానే గుర్తించి వారికి అవసరమైన సామగ్రిని అందించడం జర్నలిస్ట్ సంఘం సేవాభావానికి నిదర్శనమని,,, ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు చదువుపై మరింత దృష్టి పెట్టేలా ప్రోత్సహించిందని మండల విద్యాశాఖ అధికారి గుమ్మడి లక్ష్మీనారాయణ అభినందించారు సమాజానికి వార్తలు అందించడమే కాకుండా, భవిష్యత్ తరాలకు వెలుగు చూపే కార్యక్రమాలు చేపడుతూ టీయూడబ్ల్యూజే–ఐజేయూ సంస్థ ఆదర్శంగా నిలుస్తోందని విద్యాభివృద్ధే లక్ష్యంగా జర్నలిస్టులు చేపడుతున్న ఈ తరహా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నెల్లూట్ల భాస్కర్ ప్రశంసించారుఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా నాయకులు పాలడుగు శ్రీధర్, మహమ్మద్ అజ్మీర్, శెట్టి పరశురాములు, మండల ఉపాధ్యక్షులు గోగు విజయ్ కుమార్, దేసూ వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శి తీగల ప్రేమ్ సాగర్, గంగిశెట్టి రాకేష్ వర్మ, ముఖ్య సలహాదారులు బొజ్జ సునీల్, ఉబ్బని శ్రీహరి, దామెర అశోక్, బిక్షపతి, దేవేందర్, సుధాకర్, చాపల శ్రీనివాస్, నాంపల్లి రాజ్ కుమార్, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :