GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : కరీంనగర్/జమ్మికుంట/మార్చి 14/అక్షరం న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మోత్కులగూడెం 9వ వార్డు కౌన్సిలర్ పొనగంటి రాము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వార్డు ప్రజలకు మన వార్డులో ఆడపిల్ల పెళ్లి జరిగితే 1016 రూపాయలు, అమ్మాయి జన్మిస్తే 5016 బ్యాంకులో డిపాజిట్ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. శనివారం రోజున వార్డులో ఆడపిల్ల జరిగితే స్వయంగా కౌన్సిలర్ రాము దంపతులిద్దరూ వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి 1016లో అందజేసి తన హామీని నిలబెట్టుకున్నాడు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్నికల్లోనే మర్చిపోయే ఈ రోజుల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి మా వార్డు ఆడపిల్ల పెళ్ళికి స్వయంగా హాజరై ఆర్థిక సహకారాన్ని అందించిన మా వార్డు కౌన్సిలర్ పొనగంటి రామన్న మాట ఇచ్చాడంటే కచ్చితంగా అమలు చేస్తాడని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
.
Aksharam Telugu Daily