Saturday, 07 February 2026 04:33:02 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి అభివృద్ధి నేను చేసి చూపిస్తా … ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ..ఒకటో వార్డు అభ్యర్థి పూరెళ్ల శైలజ సుధాకర్

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 06 February 2026 05:29 PM Views : 32

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఫిబ్రవరి 6 అక్షరం న్యూస్; పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయ రమణారావు పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ వార్డు (బంధంపల్లి)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూరెళ్ల శైలజ సుధాకర్ గెలుపు కోసం ఇంటింటా తిరుగుతూ గడప గడపకు ప్రచారం చేశారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామని, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు భరోసా ఇచ్చారు. “ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి… అభివృద్ధి నేను చేసి చూపిస్తా” అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి మరియు హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారానికి మద్దతు తెలిపారు. ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :