DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వశ్రీరాంపూర్/ ఫిబ్రవరి 23/ అక్షరం న్యూస్:మండలంలోని పెగడపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో సోమవారం నవ క్రాంతి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులతో పాటు గ్రామంలోని ప్రజలందరూ గుంపులు, గుంపులుగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గుండె స్కానింగ్, 2డిఎకో, బీపీ, షుగర్ వంటి ఖరీదైన పరీక్షలు నిర్వహించడంతో సుమారుగా 200 మంది రైతులు ప్రజలు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. అవసరం ఉన్నవారికి డాక్టర్లు ప్రెస్క్రిప్షన్ రాసిచ్చారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో దాదాపుగా 200 మంది రైతులు గ్రామ ప్రజలు వివిధ రకాలైన పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా నవ క్రాంతి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఐసిఎస్ మేనేజర్ టి. సతీష్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ తూండ్ల అరుణ మాట్లాడుతూ రైతులు, గ్రామ ప్రజల ప్రయోజనం కోసం ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించామని, ఇందులో రైతులు గ్రామస్తులు వేలాది రూపాయల విలువైన పరీక్షలు నిర్వహించుకున్నారని అన్నారు. ముఖ్యంగా రైతులు గ్రామస్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, నవ క్రాంతి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఐసిఎస్ మేనేజర్ టి. సతీష్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ తూండ్ల అరుణ, ఉప సర్పంచ్ పత్తి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు, రైతులు, గ్రామస్తులు, పలువురు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily