D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : * మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మార్చి 26(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని కోమాట్లగూడెం గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామంలోని ఆడపడుచులందరూ కలిసి సంప్రదాయబద్ధంగా తలంబ్రాల బియ్యం సిద్ధం చేశారు కోమాట్లగూడెం గ్రామంలో రేపు జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి గ్రామం సిద్ధమవుతోంది. ఈ వేడుకలో అత్యంత కీలకమైన ఘట్టం తలంబ్రాల తయారీ. ఈరోజు గ్రామ ఆడపడుచులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో స్థానిక ఆలయానికి చేరుకున్నారుపూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆచారం ప్రకారం.. మహిళలు అందరూ కలిసి రోకళ్లతో పసుపు దంచి ఆ పసుపును బియ్యానికి కలిపి తలంబ్రాలను సిద్ధం చేశారు. రామయ్య పెళ్లి కోసం తమ వంతు సేవ చేయడం సంతోషంగా ఉందని, ఈ తలంబ్రాల తయారీతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తిపాటలు, కోలాటాల మధ్య ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా సాగుతుంది.
.
Aksharam Telugu Daily