Monday, 16 February 2026 06:15:40 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గెలుపు దిశగా దూసుకెళ్తున్న ఐదో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ...అభివృద్ధే లక్ష్యంగా ప్రచార మంత్రం జపిస్తున్న గుజ్జుల కుమార్ ...చెయ్యి గుర్తుకే జైకొడుతున్న

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 09 February 2026 12:20 PM Views : 82

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఫిబ్రవరి 9 అక్షరం న్యూస్; పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ఐదో వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన గుజ్జుల కుమార్ గెలుపు బాటలో వేగంగా దూసుకెళ్తున్నారు. ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న స్పందన ఆయన విజయావకాశాలను మరింత బలపరుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అండదండలతో, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతో ఐదో వార్డులోని ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని గుజ్జుల కుమార్ ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. ఈ హామీలతో ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. “నన్ను గెలిపిస్తే ఐదో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తా… ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తా” అంటూ ఇచ్చిన హామీలు ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ఆయన స్పష్టమైన కార్యాచరణను ప్రజల ముందు ఉంచుతున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా వార్డు ప్రజలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటూ చెయ్యి గుర్తుకే జై అంటూ నినాదాలు చేస్తున్నారు. గుజ్జుల కుమార్ ప్రచారానికి లభిస్తున్న అనూహ్య స్పందనతో ఐదో వార్డులో కాంగ్రెస్ జోరు మరింత పెరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మరో గెలుపు ఖాయమనే నమ్మకం కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :