D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/ కొత్తగూడ : !* మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ మార్చి 16() మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అజాగ్రత్తగా వచ్చిన బైక్, నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది.కొత్తగూడ మండలం రౌతుగూడెం గ్రామానికి చెందిన వీరన్న (58) అనే వ్యక్తి, మండల కేంద్రంలో తన పనులు ముగించుకుని రాత్రి సమయంలో ఇంటికి కాలినడకన బయలుదేరారు. కొత్తగూడలోని పోచమ్మ గుడి సమీపంలోకి రాగానే, కోనాపూర్ గ్రామానికి చెందిన అక్కెర్ల నితీష్ (26) అనే యువకుడు తన బైక్‌తో వీరన్నను వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడని సమాచారం ఈ ప్రమాదంలో వీరన్నకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది (పైలట్ ఫక్రుద్దీన్, ఈఎంటీ మహేందర్) ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితుడిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు.
.
Aksharam Telugu Daily