Sunday, 15 March 2026 02:14:49 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రైతులు దుక్కులను ఎక్కువ లోతు దున్నడం వల్ల చీడపీడల ఉధృతి తగ్గుతుంది వ్యవసాయ శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 13 March 2026 02:42 PM Views : 84

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి మార్చి 13 (అక్షరం న్యూస్) రైతులు వేసవి లో దుక్కులు ఎక్కువ లోతు దున్నడం వల్ల చీడపీడల ఉధృతి తగ్గుతుందని సూచించారు ఈ సందర్భంగా ఓదెల మండల కేంద్రంలోనీ రైతు వేదిక లో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) , వ్యవసాయ శాఖ మరియు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (TRVK) కరీంనగర్ ఆధ్వర్యం లో రైతులకు ప్రకృతి వ్యవసాయం, భూసార పరీక్ష ఆధారిత ఎరువుల వినియోగం, బిటి 3 పత్తి విత్తనాల వలన కలిగే నష్టాలు, మరియు ప్రస్తుత సాగు చేస్తున్న పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై రైతులకు RPL ట్రైనింగ్ మరియు సామర్ధ్యం పెంపుదల (కెపాసిటీ బిల్డింగ్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఓదెల గ్రామ సర్పంచ్ శ్రీ కనికిరెడ్డి సతీష్ పాల్గొని, రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు అధికారుల, శాస్త్రవేత్త ల సలహాలు సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్ శాస్త్రవేత్త డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షలు చేసుకోవాలి అని. భూసార పరీక్ష ఆధారిత ఎరువుల వేసుకోవాలి అన్నారు. అధిక ఎరువుల వినియోగం వలన చీడ పీడల ఉధృతి ఎక్కువ ఉంటుంది అన్నారు. వేసవి లో లోతు దుక్కులు దున్నడం వలన చీడ పీడల ఉధృతి తక్కువ గా ఉంటుంది అన్నారు. పెద్దపల్లి వ్యవసాయ డివిజన్ ఏడిఏ శ్రీనాథ్ మాట్లాడుతూ రైతులు శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటిస్తూ సాగులో మెలకువ ల తో అధిక దిగుబడులు సాధించాలి అన్నారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి భాస్కర్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు , రైతులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :