AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం / సుజాతనగర్ / ఫిబ్రవరి 18 / అక్షరం న్యూస్ - : కొత్తగూడెం 21డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికైన చింతలపూడి శ్రావణి మంగళవారం టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతా రాములు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సుజాతనగర్ లోని వారి స్వగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి దంపతులను నాగా సీతారాములు దంపతులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల మన్ననలు పొందాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
.
Aksharam Telugu Daily