Saturday, 07 February 2026 04:32:04 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

23వ వార్డులో దూసుకెళ్తున్న ‘సింహం’ ...ఐఎఫ్‌బి అభ్యర్థి జడల సురేందర్ విస్తృత ప్రచారం

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 06 February 2026 05:26 PM Views : 22

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి | ఫిబ్రవరి 6 (అక్షరం న్యూస్): పెద్దపల్లి పట్టణంలోని 23వ వార్డులో ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ (ఐఎఫ్‌బి) పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి జడల సురేందర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కార్యకర్తలు, అనుచరులతో కలిసి ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని, మౌలిక వసతుల కల్పనతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తానని ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. జడల సురేందర్ చేపడుతున్న ప్రచారానికి వార్డులో అనూహ్య స్పందన లభిస్తోందని పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. ఐఎఫ్‌బి పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ నమ్మకాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి తనయ, బీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆశీర్వాదంతో పాటు, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ అండదండలతో 23వ వార్డులోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని జడల సురేందర్ ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో 23వ వార్డులో ఐఎఫ్‌బి పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోందని, పోరు ఆసక్తికరంగా మారుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :