Tuesday, 10 February 2026 08:34:21 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం .. మంత్రి పొంగులేటి మున్సిపాలిటీల అభివృద్ధికి సర్కార్ కట్టుబడి ఉంది.. రూ. 3.17 కోట్ల పనుల శంకుస్థాపనలో మంత్రి వ్యా

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 January 2026 05:16 PM Views : 108

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి 9 (అక్షరం న్యూస్) ఇల్లెందు : ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ. 3.17 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. "కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇల్లెందు మున్సిపాలిటీకి మహర్దశ పడుతుందని, పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని" పేర్కొన్నారు. ప్రధానంగా పట్టణంలోని 1, 4, 7, 8, 9, 18, 22, 24 వార్డులలో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇల్లెందును అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడుగు సాంబమూర్తి, మండల రాము, బోళ్ల సూర్యం, చిల్లా శ్రీనివాస్, జిల్లా అధికారులు, స్థానిక అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :