Saturday, 07 February 2026 06:19:55 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

డిప్యూటీ సీఎం భట్టి గారి పై*అసత్య రాతలను* *ఖండిస్తున్నాం*.. *వైరా కాంగ్రెస్ పార్టీ 3 వ డివిజన్ ఉపాధ్యక్షులు ఏదునూరి శ్రీను* *40 ఏళ్ల మచ్చలేని రాజ

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 19 January 2026 10:13 AM Views : 146

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 19 వైరా (అక్షరం న్యూస్) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై ఏబీఎన్ రాధాకృష్ణ తన 'కొత్త పలుకు'లో రాసిన రాతలు సత్య దూరంగా ఉన్నాయని  ఏదునూరి శీను అన్నారు.  పత్రికా స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని ప్రజా నాయకులపై బురద చల్లడం తగదని హెచ్చరించారు. గాంధీ కుటుంబం ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చిన భట్టి విక్రమార్క, గత 40 ఏళ్లుగా సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని శీను గుర్తు చేశారు. "దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా తెలంగాణ ఏర్పాటులో భట్టి కీలక పాత్ర పోషించారు. మచ్చలేని రాజకీయ చరిత్ర కలిగిన అటువంటి నాయకుడిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీని తెలంగాణలో బలపరచాలనే దురుద్దేశంతోనే ఏబీఎన్ ఇటువంటి అసత్య కథనాలు రాస్తున్నదని అర్థమవుతుందన్నారు. కావాలని రాష్ట్ర మంత్రివర్గంలో అభిప్రాయ భేదాలు సృష్టించి, ప్రభుత్వంపై అస్థిరత కల్పించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి వ్యవహారంలో వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత గాథలు రాయడం తెలంగాణ సమాజాన్ని కించపరచడమేనన్నారు. "గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీ పత్రికను నిషేధించినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడింది. ఈ రోజు అదే పార్టీకి మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ చానల్ కు, ఇతర మీడియా సంస్థలకు ఉన్న వ్యక్తిగత తగాదాలను కాంగ్రెస్ పార్టీకి  అంట కట్టడం సరికాదన్నారు. తెలంగాణ సమాజం హర్షించని విధంగా, కేవలం మీ అనుకూల వ్యక్తులను బలపరిచేందుకు రాసే రాతలను కాంగ్రెస్ కార్యకర్తలు గమనిస్తున్నారని  పేర్కొన్నారు. ఇకనైనా అవాస్తవాలు రాయడం మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు. లాగి

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :