Jakkani Rajaramesh , SIRCILLA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : ...! రాజన్న సిరిసిల్ల, జనవరి 18 (అక్షరం న్యూస్): అభివృద్ధి పేరుతో ప్రజలను దోచుకోవాలని చూసే అవినీతి నాయకులకు, ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దండుకుని మభ్యపెట్టే నాయకులకు ఎంతో ఆశ కలిగించే మున్సిపల్ ఎన్ని"కల" వచ్చేసింది.. నూతన ఉత్సాహంతో కొత్తగా అవకాశం ఇవ్వాలని ఎదురు చూస్తున్న నాయకులకు పండగ రానే వచ్చింది... కానీ ప్రజలకు మాత్రం ఎవరిని ఎన్నుకోవాలో.. ఎవరు గెలిచిన తర్వాత మనకు సాయం చేస్తారో లేదో..అర్థం కానీ ప్రశ్న...అసలు "నిస్వార్థ సేవకుడు" ఎవరు అనే ప్రశ్న ప్రజల మదిలో నాటుకున్న మాట..ఎన్నికలలో ఒక మాట... గెలిచిన తర్వాత ఒక మాట...వారికి తెలిసిన బాటే ... ప్రభుత్వం మారిన అవినీతి మారుతుందా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. గత ఎన్నికలలో గెలుపు సాధించిన కౌన్సిలర్లు చేసిన అవినీతి గుర్తు చేసుకుంటే ఒక్కొక్కరి రోదనలు ఇంకా వినిపిస్తున్నాయి. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నుకున్న కౌన్సిలర్లు తమ ఇష్టారాజ్యంగా అమాయక, నిరుపేద ప్రజల వద్ద వివిధ పథకాలను అడ్డం పెట్టుకుని డబ్బులు దండిగా దండుకున్నారని ప్రజలందరికీ తెలుసు... గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబల్ బెడ్ రూమ్ పథకం, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాలు పేద ప్రజల చేతికి అందాలంటే గత కౌన్సిలర్ల అవినీతి చాటున ఇబ్బందులు తప్పలేదు..అనేది నిజం..ఈ పథకాలను అడ్డం పెట్టుకొని కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు అవినీతికి పాల్పడ్డ వారిపై గత ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు... ప్రజలైన ఈసారి వారిని గుర్తించి తగిన గుణపాఠం చెబుతారో.. లేక ఆర్థిక లబ్ధికి లొంగుతారో వేచి చూడాలి... భూ కబ్జాలు.. అవినీతి వ్యాపారాలు చేసుకుంటూ.. నాయకులు పాలకులు బాగానే పబ్బం గడుపుతూ కాలం గడిపారు. ఇప్పటికైనా ప్రజలను, తమను నమ్మిన ఓటర్లను, మోసం చేయకుండా నీతి నియమాలు, ధర్మత సిద్ధాంతాలు పాటించి తమ వార్డులను అభివృద్ధి చేసుకుంటూ సుపరిపాలన సాగించి అందరి మన్నలను పొందాలని ప్రతివార్డు ప్రజలు కోరుకుంటున్నారు. రోజులు మారాయి.. అవినీతి చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే ఎవరు చూస్తూ ఉండలేరు... వారిని నిలదీసే హక్కులను కలిగిన ప్రజలు, వార్డులో ఒక్కరైనా ప్రశ్నించే వరకు తెచ్చుకోకూడదని ప్రజలు అనుకుంటున్నారు.. రాష్ట్రంలో యువ నాయకునిగా పేరుగాంచిన కేటీఆర్ కు సిరిసిల్లలో అవినీతి మచ్చ తీసుకువచ్చిన కౌన్సిలర్లకు ప్రజలు చెక్ పెడతారో లేదో వేచి చూడాల్సిందే...!
.
Aksharam Telugu Daily