Jakkani Rajaramesh , SIRCILLA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల, జనవరి- 17 (అక్షరం న్యూస్): పలు ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. 2024 వేసవి సెలవుల్లో ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులు వెంటనే చెల్లించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి స్పందిస్తూ ఎన్నికల విధులు నిర్వహించిన వారికి ఈఎల్ ఉత్తర్వులు త్వరలోనే ఇస్తామని మెడికల్ బిల్లులకు సంబంధించిన సెక్షన్ ఇన్చార్జి ఖాళీగా ఉండటం వల్ల కొంత ఆలస్యం జరిగిందని ఇప్పుడు ఎలాంటి సమయపాలన చేయకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని సంబంధిత నాయకులు తెలిపారు.
.
Aksharam Telugu Daily