Saturday, 07 February 2026 06:20:03 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

4.59 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు వాకింగ్ చేసే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు.. ఐటీఐ కళాశాలలో 1.5 కోట

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 17 January 2026 08:52 AM Views : 123

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జనవరి 16 అక్షరం న్యూస్ పెద్దపల్లి పట్టంలోని ఐటీఐ కళాశాల మైదానంలో వాకర్ సౌకర్యార్థం రూ. 91 లక్షలతో, ఐటీఐ కళాశాలలో రూ. 1.5 కోట్లతో స్విమ్మింగ్ పూల్, అలాగే రూ. 39 లక్తలతో పెద్దపల్లి బస్ స్టాండ్ సమీపంలో అంబేద్కర్ జంక్షన్ అభివృద్ధి సీసీ రోడ్డు, డ్రైనేజీ లు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు అనంతరం రూ. 29 లక్షలతో పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో వెయిటింగ్ హాల్ మరియు టాయిలెట్స్ నూతన నిర్మాణాలకు శంకుస్థాపన అనంతరం పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి మరియు తెనుగువాడ పెద్దమ్మనగర్ లో 1.50 కోట్ల తో నూతన సెంటర్ లైటింగ్ ప్రారంభోత్సవాలు చేశారు పెద్దపల్లి చింతకుంట విజయరమణరావు అనంతరం పట్టణంలోని చందపల్లి 15,16,17 వార్డుల్లో 54 మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నూతన నిర్మాణాలకు ముగ్గులు పోసి భూమి పూజ అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లిలో జరుతున్న అభివృద్ధి కార్యక్రమాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఐటీఐ కళాశాలలో వాకింగ్ చేసే ప్రజలు మమ్మళి సంప్రదించగా వారి కోరిక మేరకు రూ. 91 లక్షలతో నూతన వాకింగ్ ట్రాక్ లైట్లతో పాటు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పెద్దపల్లి పట్టణంలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పట్టణం సుందరంగా మారుతుందని ప్రజలందరూ అభివృద్ధిని గమనిస్తున్నారని తెలిపారు. పెద్దపల్లి బస్ స్టాండ్ సమీపంలో, మహిళా పోలీస్ స్టేషన్లో, ఐటీఐ కళాశాలలో స్విమ్మింగ్ పూల్ వంటి అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం రోజున శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. పట్టణంలోని చందపల్లిలో మరియు పెద్దమ్మ నగర్లో రూ.1.50 కోట్లతో ప్రారంభం చేసుకోవడం జరిగిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్దపల్లి పట్టణంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మరియు గత పాలకులు పెద్దపల్లి పట్టణాన్ని దోచుకున్నారని అభివృద్ధిని గత పాలకులు మర్చిపోయారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక పెద్దపల్లి పట్టణాన్ని సిద్ధం సుందరంగా మారుస్తున్నారని వ్యక్తం చేశారు ఈకార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పలు గ్రామాల సర్పంచులు మరియు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :