D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ డిసెంబర్ 14 (అక్షరంన్యూస్) ఖమ్మం జిల్లా తల్లాడ మేజర్ పంచాయతీలోని పలు వార్డులకు సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన ప్రచారంలో శనివారం బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు తల్లాడ మండల అధ్యక్షులు చల్ల నాగులుతో కలిసి పాల్గొన్నారు. తల్లాడ పంచాయతీలోని 5వ వార్డ్ లోని వేము రజితను గెలిపించాలని విద్యావంతులకు పట్టం కడితే పంచాయతీ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పలువార్డులలో అభ్యర్థుల విజయం కాంక్షిస్తూ ఓటర్లను ఓట్ల అభ్యసించారు. గడపగడపకు పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులతోటే సాధ్యమని పంచాయతీకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతాయని తెలిపారు. ప్రస్తుతం రేషన్ దుకాణాలు నుంచి అందుతున్న రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలలో నడిచే పలు పథకాలు కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ పేరును ప్రస్తావిస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. పంచాయతీ ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థులకు గెలిపించి పంచాయతీల యొక్క అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించాలని ఓటర్లను కోరారు. పంచాయతీల యొక్క అభివృద్ధి సాధ్యమని ధన ప్రభావానికి లొంగకుండా న్యాయం చేసే అభ్యర్థులను ఎంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సర్పంచ్ అభ్యర్థి చల్లా నాగులు, ప్రధాన కార్యదర్శి పెరిక కిరణ్, పార్టీ ఉపాధ్యక్షులు గొల్లమందల నరేష్ మేము రజిత కార్యదర్శి చల్లా నరేష్, తమ్మిశెట్టి కృష్ణ, సత్తుపల్లినియోజకవర్గ నాయకులు సంగీతం సాయి చంద్, పులి వెంకటేశ్వర్లు, చౌడా నాగేశ్వరరావు, నరసింహారావు, పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily