Monday, 15 December 2025 07:17:24 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రాజ్యాంగాన్ని గౌరవించనివారు దేశద్రోహులు.. విశ్వాసాల ముసుగులో జస్టిస్ గవాయ్ దాడి దుర్మార్గపుచర్య..

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి ఘటనను సుమోటోగా తీసుకోకపోవడం బాధాకరం.. దళితులు, న్యాయవ్యవస్థ, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి నవంబర్ 1న హైదరాబాదులో భారీ నిరసన ర్యాలీ.. విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 29 October 2025 05:50 PM Views : 199

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ అక్టోబర్ 29 (అక్షరంన్యూస్) భారతదేశంలో రాజ్యాంగాన్ని గౌరవించిన వారు చట్టాలకు విలువనివ్వని వారు దేశద్రోహులుగా పరిగణింపబడతారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ... దళితులపై ఇప్పటికి వివక్ష, అంటరానితనం, దాడులు, హత్యలు, హత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి నిత్యం సామాన్య ప్రజల మీద ఎక్కడో ఓ దిక్కు జరుగుతూనే ఉన్నాయన్నారు. మీడియా ద్వారా చూస్తూనే ఉన్నామన్నారు. దేశ అత్యున్నత వ్యవస్థ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయ్ మీదనే సుప్రీంకోర్టులో బూటుతో దాడి జరిగిందని ఆరోపించారు. ఆ సంఘటన దేశం, ప్రపంచంలోనే ప్రజలు నివ్వెరపోయారన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగి మూడు వారాలు గడుస్తున్నప్పటికీ ఢిల్లీ పోలీసులు మౌనంగా ఉన్నారు. కేసులు పెట్టలేదు. న్యాయవ్యవస్థ సుమోటోగా కేసు తీసుకోలేదు. మానవ హక్కుల కమిషన్ స్పందించలేదు. అంటే ఈ దేశంలో దళితులకు ఇప్పటికీ రక్షణ లేదని స్పష్టంగా రుజువు అవుతుందన్నారు. దాడి చేసిన వ్యక్తి, ఆ వ్యక్తిని సమర్థించే శక్తులు సోషల్ మీడియా ద్వారా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అభిప్రాయాలను చెబుతూనే.. మేము మళ్ళీ మళ్ళీ దాడులు చేస్తామని చెబుతూనే ఉన్నారన్నారు. ధర్మం ముసుగులో, విశ్వాసాల ముసుగులో రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా, చట్టాలకు విలువనివ్వకుండా దాడులు చేస్తామంటే వారు దేశ రాజ్యాంగాన్ని గౌరవించినట్లే చట్టాలకు విలువైనట్లే కదా అని భారత రాజ్యాంగాన్ని భారత పౌరులుగా మనమే అంగీకరించకపోతే, విలువనివ్వకపోతే ఇతర దేశస్థులు ఇస్తారా అంటూ.. మనం ఈ దేశభక్తులం ఎట్లా అవుతామని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారు, మన చట్టాలకు విలువనిచ్చేవారు దేశభక్తులు అవుతారన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించని వారు చట్టాలకు విలువనివ్వని వారు దేశద్రోహులవుతారని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి చేయరన్నారు. దళితుడు జస్టిస్ గవాయ్ స్థానంలో వేరే జస్టిస్ ఉంటే దాడి జరిగేనా అని ప్రశ్నించారు.? గతంలో జార్ఖండ్ రాష్ట్రంలో న్యాయవాది, న్యాయమూర్తి మధ్యన జరిగిన చిన్నపాటి వాగ్వివాదంపై న్యాయమూర్తిని అవమానించాడని ఐదుగురు జడ్జిల బృందం అర్ధగంటలో న్యాయవాదిపై కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. అదేవిధంగా రౌడీషీటర్ రివాజ్ పై 40 కేసులు ఉన్నాయని, నిజాంబాద్ లో సంఘటన జరిగితే హైదరాబాద్ పోలీసు కస్టడీలో ఉన్న రివాజ్ ఎలా చనిపోతాడని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు. దీనిని బట్టి చూస్తే చీప్ జస్టిస్ దళితుడి మీద సుప్రీంకోర్టులో దాడి జరిగితే సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఈ దేశంలో ఇంకా దళితులకు జరగాల్సిన న్యాయం జరగట్లేదని, దళితులు ఏ స్థాయికి ఎదిగినా కూడా అవమానాలు దాడులు, హత్యలు, జరుగుతున్నాయన్నారు. వారికి న్యాయం జరగట్లేదని స్పష్టం అవుతుందన్నారు. అధికారాలు ఉన్న పోలీసులు, మానవ హక్కుల కమిషన్, రాజ్యాంగ సంస్థలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు..? దాడి చేసిన వారు స్వేచ్ఛగా ప్రెస్ మీట్లలో సోషల్ మీడియాలలో మాట్లాడుతూ.. మా విశ్వాసాల పరంగా దాడి చేశాం.. దానికి కట్టుబడి ఉన్నామని మాట్లాడుతున్నారని, ఎవరు విశ్వాసాలు వారి వ్యక్తిగతం. ఎవరి మతాలు వారు దేశంలో గౌరవించుకుంటున్నా.. రాజ్యాంగాన్ని మాత్రం అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టంచేశారు. విశ్వాసాల ముసుగులో దాడులు, హత్యలు చేస్తే రాజ్యాంగం.. చట్టాలు ఎందుకని నిలదీశారు..? అందుకే దళితుడైన చీఫ్ జస్టిస్ గవాయిపై సుప్రీం కోర్టులో జరిగిన దాడిని, దళితులందరిపై జరిగిన దాడిగా పరిగణిస్తూ.. దళితుల ఆత్మగౌరాన్ని కాపాడుకోవడానికి, న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి నవంబర్ 1న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా జరగని నిరసన ర్యాలీ హైదరాబాదులో జరుగుతుందని, కుల, మత, రాజకీయలతీతంగా ప్రతి ఒక్కరు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో ఖమ్మం జిల్లా ఇంచార్జి కందికట్ల విజయ్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు తూరుగంటి అంజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి సునీల్ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు చిలక నాగరాజు, గొల్లమందల ముత్తారావు, తోళ్ళ సురేష్, తూరుగంటి రాము, బాకీ శ్రీను, కనకం జనార్ధన్, చింతిరాల నాగభూషణం, కొలికపోగు ప్రభు, సూరేపల్లి నాగేశ్వరరావు, తోళ్ళ వెంకన్న, పొట్టపింజర బాలస్వామి, పార్షపు ఇనుక, పగిడిపల్లి రవీందర్, మాదాసు వెంకన్న, లంజపల్లి భద్రం, పడిశాల నాగేశ్వరరావు, కుక్కల లక్ష్మయ్య, చిర్రా ఉపేందర్, స్వామి, చాగంటి నరసింహారావు, రాజు, నాగేశ్వర్రావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :