D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /తల్లాడ డిసెంబర్ /14 (అక్షరంన్యూస్) గొల్లగూడెం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి దుండేటి శాంతకుమారి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పంచాయతీలో ఉన్న అన్ని ఇల్లులను కలయ తిరిగి ఓటర్లను మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని, మీ సమస్యలకు పరిష్కారం నా గెలిపే అంటూ కొంతసేపు వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ దుండేటి వీరారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్ బాబు, వెంకట కృష్ణారెడ్డి, ఇసునేపల్లి వెంకటేశ్వర్లు, గొల్లమందల చలపతిరావు, కాశి పోగు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily