D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ వైరా డిసెంబర్ 14 (అక్షరంన్యూస్) వైరా మండలంలో 22 గ్రామపంచాయతీలకు జరిగిన ఎన్నికలలో నాలుగు ఏకగ్రీవం కావడం ,18 చోట్ల ఎన్నికలు నిర్వహించారు .ఈ 18 చోట్ల ఎన్నికల విధి నిర్వహణలో వైరా పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరి నోట ఫలించిన పోలీసుల వ్యూహం అంటూ ప్రశంసల వరకు కురిపిస్తున్నారు. వైరా ఎస్సై పుష్పాల రామారావు ఓ ప్రత్యేక స్థానాన్ని విధి నిర్వహణలో ప్రజలతో చెరగని ముద్ర వేసుకున్నారు . వైరా పోలీస్ స్టేషన్లో రామారావు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అన్ని వర్గాల ప్రజలతో ఒకడిలా కలిసిపోవడం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు నిదర్శనం అని కూడా చెప్పవచ్చును.ఎన్నికలు అంటేనే వివాదాలు.. ఘర్షణలు.. కేసులు.. అరెస్టులు.. అభ్యర్థులు కావచ్చు.. వాళ్ళ అనుచరులు కావచ్చు.. గెలుపు కోసం కుమ్ములాడుకోవడం ఫలితాల కోసం సిగపట్లు చాలా చోట్ల చూశాం.. .. కానీ వైరాలో ఎన్నికల్లో తీరు మారింది.. ఒక్క వివాదం లేకుండా.. ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యింది.. వ్యూత్మకంగా వ్యవహరించిన పోలీసులు వివాదాలకు తావు లేకుండా ఎన్నికల ఘట్టాన్ని పూర్తి చేయగలిగారు.మండలములో సమస్యాత్మక గ్రామాలు చాలా ఉన్నాయి. ఎన్నికల తరుణం వచ్చిందంటే చాలు వివాదాలతో, ఘర్షణలతో గ్రామాలు అట్టుడికి పోవడం సర్వసాధారణంగా కనిపించేది. గతంలో అష్ణగుర్తి, గోళ్లేనపాడు, గొల్లపూడి, రెబ్బవరం, సిరిపురం, తాటిపూడి గ్రామాలలో పెద్ద ఎత్తున వివాదాలు, ఘర్షణలు జరిగాయి. పలు కేసులు నమోదు కావడం తో సమస్యాత్మక గ్రామాలుగా అప్పట్లో పోలీసులు గుర్తించారు. ఏ ఎన్నికలు జరిగినా పోలీసులు ఆయా గ్రామాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి టికెటింగ్ నిర్వహించడం సర్వసాధారణంగా పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని సమస్యలుగా గ్రామాలలో ఇలాంటి గొడవలు ఘర్షణలు వివాదాలు లేకుండా ఎన్నికలను సజావుగా సాగించి పోలీస్ స్టేషన్ ఇప్పుడు రికార్డుకు ఎక్కింది. ఈ ఎన్నికల్లో కూడా అది పునరావృతమైంది. సమస్యాత్మక గ్రామాలపై వైరా పట్టణ ఎస్ ఐ పుష్పాల రామారావు దృష్టి పెట్టడంతో పాటు వివాదాలకు ఆస్కారం ఉన్న గ్రామాలపై కూడా నిఘా వేసి ఉంచారు. ఎక్కడ ఎలాంటి వివాదానికి ఆస్కారం ఉన్న ముందుగా వెళ్లి అక్కడ సమస్యను పరిష్కరించే వివాదాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి తోడు గ్రామాలలో ఎన్నికల అవగాహనా సదస్సులు, ఫుట్ పెట్రోలింగ్ అభ్యర్థులు ఎలా మసులుకోవాలి.. ప్రజలు ఎలా బాధ్యతగా ఉండాలి.. ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి.. అన్న అంశాలపై గ్రామస్తులకు గ్రామపంచాయతీ ఎన్నికలకు ముందే అవగాహన కల్పించారు. వివాదాస్పద వ్యక్తులను ముందుగానే గుర్తించి వారిని బైండోవర్ చేసి గొడవలకు పాల్పడకుండా కట్టడి చేశారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచే గ్రామాలలో తిరిగి గ్రామాలను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఎన్నికల రోజున ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్య వరకు పూర్తిస్థాయిలో అప్రమత్తమై పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేలా కృషి చేశారు. సామాజిక మద్యమాల్లో కూడా అభ్యర్థులు పోటీదారులు ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముందుగానే హెచ్చరించారు. గ్రామాల్లో ప్రజలను పిలిచి వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. సాధారణ సమయాల్లో నమోదయ్య కేసుల కంటే ఎలక్షన్లలో నమోదయ్య కేసులో చాలా తీవ్రంగా ఉంటాయని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం చాలా కష్టమని తమ మాటలు అర్థం చేసుకోకపోతే నష్టం జరుగుతుందని పోలీసులు చెప్పిన మాటలు పల్లె జనులు బాగా ఆకలింపు చేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క కేసు లేకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం ప్రశంసలు అందుకుంటున్నారు. *ప్రజలు అందించిన సహకారానికి కృతజ్ఞతలు* పట్టణ ఎస్ ఐ పుష్పాల రామారావు మాట్లాడుతూ ఉన్నత అధికారుల సూచనలతో ప్రజల సహకారం మరువలేనిదని శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు..
.
Aksharam Telugu Daily